calender_icon.png 26 March, 2025 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పనులు కల్పించాలి

25-03-2025 09:40:00 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పనులు కల్పించాలని మంగళవారం దోమకొండ మండల ప్రత్యేక అధికారి జ్యోతి తెలిపారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఉపాధి హామీ పనులు కల్పించడంలో సిబ్బంది నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. అన్ని గ్రామాలలో ఉపాధి హామీ పనులు కొనసాగాలన్నారు.