calender_icon.png 3 February, 2025 | 12:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి హామీ..నిధుల లేమి

03-02-2025 12:57:56 AM

* మూడు నెలలుగా వేతనాలు లేవ్...

* ఆందోళన బాటలోఉపాధి ఉద్యోగులు

మెదక్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిధుల లేమితో గత మూడు నెలలుగా సిబ్బందికి వేతనాలు అందడం లేదు. మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తమ సమస్యలను 15 రోజుల్లో పరిష్కరించడంతో పాటు పెండింగ్ లో ఉన్న మూడు నెలల వేతనాలను అందజేయాలని కోరుతూ నిరసన ప్రదర్శనలకు ఉద్యోగులు పూను కున్నారు. ఇందులో భాగంగా రోజువారి చేపట్టే కార్యక్రమాలను రాష్ట్ర ఉపాధి ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. జేఏసీ కార్యక్రమాల వారిగా జిల్లాల్లో సైతం ఉపాధి ఉద్యోగులు ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. 

మూడు నెలలుగా జాడ లేని జీతాలు..

గ్రామీణ అభివృద్ధిలో ఉపాధి ఉద్యోగుల పాత్ర  కీలకం. ఉపాధి హామీ కార్యక్రమంలో విధులు నిర్వర్తించే అదనపు కార్యక్రమ అధికారులు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, అకౌంట్స్ అసిస్టెంట్లు, ఫీల్ అసిస్టెంట్లు గత మూడు నెలలుగా వేతనాల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని మండల, గ్రామ స్థాయిలో విజయవంతం చేసేందుకు ఉపాధి ఉద్యోగులు తీవ్రంగా శ్రమించారు.

సమగ్ర కుటుంబ సర్వే, డేటా ఎంట్రీ, ఇందిరమ్మ ఇండ్ల సర్వే, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక వంటివి రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు నెలల కాలంలో ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన నూతన కార్యక్రమాలు. వీటన్నింటిలోనూ ఉపాధి ఉద్యోగులు గ్రామస్థాయి నుండి మండల స్థాయి వరకు లబ్ధిదారుల  సర్వే, ఎంపిక వంటి అంశాలలో ఎలాంటి శక్తి వంచన లేకుండా కృషి చేశారు. అలాంటి ఉద్యోగులకు గత మూడు నెలలుగా ప్రభుత్వం వేతనాలను సకాలంలో ఇవ్వకపోవడం వలన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 

ఆందోళన బాటలో ఉపాధి ఉద్యోగులు 

పెండింగ్‌లో ఉన్న మూడు నెలల వేతనా లను వెంటనే చెల్లించాలని అలాగే తమ సమస్యలపై ప్రత్యేక చొరవ చూపి 15 రోజు ల్లోగా పరిష్కరించకపోతే ఆందోళన చేస్తా మని ఇప్పటికే ఉపాధి ఉద్యోగులు ప్రభు త్వానికి తెలియజేశారు. ఉపాధి ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే అన్ని మండల కార్యాల యాల్లో ఎంపీడీవోలకు, జిల్లాస్థాయిలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, జిల్లా కలెక్టర్లకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.

గత సంవత్సరం ఫిబ్రవరిలో ప్రభుత్వం ఉపాధి ఉద్యోగులకు పే స్కేల్ వర్తింప చేస్తామని ప్రకటించిందని, ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదని, వెంటనే పే స్కేల్ ఇవ్వాలని, ఔట్ సోర్సింగ్ విధానంలో విధులు నిర్వర్తించే కంప్యూటర్ ఆపరేటర్లకు ఎఫ్టిఈ కన్వర్షన్ పూర్తి చేయాలని, ఎస్.ఆర్.డి.ఎస్ బోర్డు తీర్మానాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ పలు నిరసన కార్యక్రమాలను నిర్దేశించింది.

వేతనాలు అందక అవస్థలు పడుతున్నాం..

గత మూడు నెలలుగా వేతనాలు సకాలంలో అందకపోవడం వల్ల ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. నెలవారి ఖర్చుతో పాటు ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులకు సైతం డబ్బులు సమకూ ర్చుకోవడం ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం ఉద్యోగుల బాధను అర్థం చేసుకొని తక్షణం పెండింగ్లో ఉన్న వేతనాలను విడుదల చేయాలి.

 శ్యామ్ కుమార్, ఎపిఓ చిలిపిచేడ్

ఈఎంఐలు చెల్లించలేక పోతున్నాం..

సరైన సమయంలో జీతాలు అందక పోవడంతో ఇప్పటికే లోన్లు తీసుకున్న వాటికి ఈ అమ్మాయిలు చెల్లించక సిబిల్ స్కోర్ దెబ్బ తిన్నది. రోజువారి విధులు నిర్వర్తించేందుకు వెళ్లాలన్న పెట్రోల్ ఇతర వాహన ఖర్చులకు సైతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

 ఎండి ముజీబ్, సిఓ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు

ప్రతి నెల వేతనాలు చెల్లించాలి..

రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల అమలులో క్షేత్రస్థాయిలో ఉపాధి ఉద్యోగుల పాత్ర కీలకంగా ఉన్నది. అలాంటి ఉద్యో గులకు ప్రభుత్వం ప్రతినెల ప్రభుత్వ ఉద్యో గులకు చెల్లిస్తున్న మాదిరిగా వేతనాలను చెల్లించాలి. సకాలంలో వేతనాలు అందక పోవడంతో చాలామంది ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభు త్వం సమస్యను పరిష్కరించి పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలి.

 రాజ్ కుమార్, జిల్లా జేఏసీ చైర్మన్