calender_icon.png 22 April, 2025 | 4:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి హామీకి 2,708 కోట్లు

22-04-2025 02:12:48 AM

  1. నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  2. సంబంధిత ఫైల్‌పై మంత్రి సీతక్క ఆమోద ముద్ర

హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయ క్రాంతి): తెలంగాణలో జిల్లాల వారీగా ఉపాధి హామీ పనులు, నిధులు, వర్క్ ప్లాన్‌ను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ మేరకు సంబంధిత ఫైల్‌పై మంత్రి సీతక్క సోమవారం సంతకం చేశారు. ఉపాధి హామీ పథకం కోసం ఈ ఏడాదికి గానూ రూ. 2,708.3 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా చేప ట్టే పనుల కార్యాచరణను రూపొందించింది. అందులో భాగంగా వేతనాల కోసం రూ. 1,625 కోట్లు, మెటీరియల్ కాంపోనెంట్ కోసం రూ. 1,083 కోట్లు కేటాయించింది. తెలంగాణకు ఈ ఏడాది 6.5 కోట్ల పని దినా ల కేటాయించింది.

ఉపాధి హామీ పనుల కింద మహిళా శక్తి ఉపాధి భరోసా, పొలం బాటలు, ఫల వనాలు, వన మహోత్సవం, జల నిధి, రూరల్ సానిటేషన్, మౌళిక సదుపాయాల కల్పన వంటి పనులను ప్రభుత్వ చేపట్టనున్నది. జిల్లాల వారీగా చేపట్టే పనులకు మంత్రి సీతక్క ఆమోదం తెలిపారు.