calender_icon.png 12 March, 2025 | 9:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీవ్ యువ వికాస్ పథకంతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన

11-03-2025 05:20:09 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): రేపట్నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నిరుద్యోగ యువత కోసం స్వయం ఉపాధి పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. యూనివర్సిటీ విద్యార్థులకు రూ.540 కోట్లతో వసతులు కల్పిస్తున్నట్లు  భట్టి తెలిపారు. తొలి విడతగా హెరిటేజ్ భవనానికి రూ.15.5 కోట్లు, పనులు మొదలు పెట్టడానికి మరో రూ.100 కోట్లు కోరారని డిప్యూటీ సీఎం తెలిపారు. యూనివర్సిటీ పనులకు తెలంగాణ ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందని, నిరుద్యోగ యువతకు ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. నిరుద్యోగ యువత కోసం స్వయం ఉపాధి పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తుంది.

సంక్షేమ శాఖల ద్వారా ఎస్పీ, ఎస్పీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా నిరుదోగ యువతకు రూ.3 లక్షల నుంచి 5 లక్షలు ఆర్థిక సాయం కాంగ్రెస్ సర్కార్ అందిస్తుందన్నారు. రాజీవ్ యువ వికాస్ పథకం కింద నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం రూ.6 వేల కోట్లు ప్రారంభించనుంది. ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి మార్చి 15 నుంచి ఏప్రిల్ వరకు కార్పొరేసన్ల నుంచి దరఖాస్తుల స్వీకారం ప్రారంభ కానున్నట్లు ఆయన వెల్లడించారు. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు లబ్ధిదారులను ఎంపిక చేసి జూన్ 2 నుంచి మంజూరు పత్రాలు అందిస్తామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.  అయితే ఈ పథకం ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని ఆశిస్తున్నట్లు భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు.