హైదరాబాద్, జనవరి 17(విజయక్రాంతి): ఇటీవల తెలంగాణలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీస్ శాఖ వారి సేవలను వినియోగిం చుకుంటోంది. అదే రీతిలో ఇప్పుడు రైల్వేశాఖ సైతం ట్రాన్స్‌జెండర్లకు అండగా నిలుస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించిన అత్యాధునిక చర్లపల్లి రైల్వే టెర్మినల్‌లో ట్రాన్స్ జెండర్లకు ‘వన్ స్టేషన్.. వన్ ప్రొడక్ట్’ పేరిట ఏర్పాటు చేసిన ఓ స్టాల్‌తో పాటు ట్రాలీ స్టాండ్‌ను కేటాయించారు.
ఈ స్టాల్‌లో ట్రాన్స్‌జెండర్లు తయారు చేసిన స్నాక్స్, జూట్ బ్యాగులు, సబ్బులు, అనేక రకాల స్థానిక ఉత్పత్తులను విక్రయించనున్నారు. త్రిపుర, సహస్ర అనే ఇద్దరు ట్రాన్స్ వుమెన్‌లు తయారు చేసిన జనపనార సంచులను ఇక్కడ విక్రయిస్తారు. ఇక్కడ ప్రతీ ఒక్క ఉత్పత్తి ప్రత్యేకమైనదే కాకుం డా ఇది వారి మనోబలాన్ని ఎంతో పెంచేందుకు అవకాశం ఏర్పడింది. వన్ స్టేషన్.. వన్ స్టాల్ పేరిట ద.మ.రైల్వే పరిధిలో మొత్తం 223 స్టాళ్లున్నాయి. ఇందులో తొలిసారిగా చర్లపల్లి టెర్మినల్‌లో ఏర్పాటు చేసిన స్టాల్‌ను ట్రాన్స్‌జెండర్లకు అవకాశం కల్పించారు.