22-02-2025 12:39:07 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): దశాబ్దకాలం పాలించిన బీఆర్‌ఎస్ ప్ర భుత్వం ఎస్సీ, ఎస్టీ యువతకు ఉపాధిని కల్పించడంలో పూర్తిగా విఫలమైందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మండిపడ్డారు. అందుకే రూ.3వేల కోట్లతో రాబోయే రెండు నెలల్లో ఎస్సీ, ఎస్టీ యువతకు స్వయం ఉపాధి పథకాలు అమలు చేయాలని అధికారులను ఆదే శించారు.
ఈ స్వయం ఉపాధి పథకాల కోసం ప్రణాళికలను వెంటనే అమలుచేయాలన్నారు. శుక్రవారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సంక్షేమ శాఖలపై ఆయన ముం దస్తు బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ అధికారులు సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో పర్యటనలు నిరంతరం కొనసాగేలా అధికారులు ఫాలోఅప్ చేసుకోవాలన్నారు.
సబ్‌ప్లాన్ చట్టం ప్రకారం.. వివిధ శాఖల నుంచి ఎస్సీ, ఎస్టీ శాఖలకు రావాల్సిన నిధులపై కసరత్తు చేసి సీరియస్‌గా ఫాలోఅప్ చేయాలన్నారు. సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాలకు సంబం ధించి అద్దెలు, డైట్ బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించాలన్నారు.
ఏ సూచన చేసినా అమలు చేస్తాం
ఎస్సీ,ఎస్టీ ఆవాసాల్లో నిరుపయోగంగా ఉన్న ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేపట్టి ఆ వర్గాల ఆదాయం పెంచేందుకు చర్య లు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి సూచించారు. ఆయా వర్గాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సంక్షేమ శాఖ అధికారులు ఏ సూచన చేసిన అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
ఆదిలాబాద్ వరకు అటవీ హక్కుల చట్టం కింద లక్షలాది మంది గిరిజనులకు భూ పంపిణీ జరిగినట్లు గుర్తు చేశారు. ఈ భూము ల అభివృద్ధికి ఎస్సీ, ఎస్టీ శాఖల అధికారులు విద్యుత్, వ్యవసాయ, అటవీ, ఉద్యాన శాఖ అధికారులతో సంయుక్తంగా సమావేశాలు నిర్వహించాలన్నారు.
సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఎస్సీ కార్పొరేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, ఎస్టీ కార్పొ రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్, డిప్యూటీ సీఎ ం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ హరిత, ఇరిగేషన్ సెక్రటరీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.