calender_icon.png 30 October, 2024 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఒక్కరికీ ఉపాధి

30-10-2024 04:17:28 AM

యువత ఉపాధికోసం కొత్త విధానాలు

నూతన సాంకేతికతలకు ప్రోత్సాహం

రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో ప్రధాని మోదీ

౫౧ వేల మందికి నియామక పత్రాలు అందజేత

ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మోదీ

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: దేశంలో అర్హులైన ప్రతి యువతీ, యువకుడికి ఉపాధి కల్పించేందుకు తమ ప్రభుత్వం కొత్త పంథాను అమలుచేస్తున్నదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఉపాధి అవకాశాలను విస్తృతం చేసేందుకు అంతరిక్ష పరిశోధనలు, సెమీకండక్టర్ల తయారీ వంటి అత్యాధుని సాంకేతికతలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. మంగళవారం రోజ్ గార్ మేళా కార్యక్రమంలో ప్రధాని వర్చువల్‌గా పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో ప్రభు త్వ ఉద్యోగాలు పొందిన ౫౧ వేల మందికి నియామక పత్రాలు అందించారు. ౭౦ ఏం డ్లు పైబడిన వృద్ధుల కోసం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ప్రధానమంత్రి జన్ ఆరో గ్య యోజన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రా రంభించారు. రోజ్‌గార్ యోజన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. గత ప్రభు త్వాలు అనుసరించిన లోపభూయిష్టమైన విధానాలతోనే దేశం వెనకబడిపోయిందని విమర్శించారు. ‘మనదేశంలో ఆధునిక సాంకేతికతలు అభివృద్ధి కావు అన్న ఒకరకమైన భావన గత పాలకుల్లో ఉండేది. అది దేశానికి ఎంతో హాని చేసింది. ఈ పాత మనస్థత్వాలను మేం విచ్చిన్నం చేసేందుకు మేం పని మొదలుపెట్టాం. మా పథకాలు, విధానాలు నేరుగా ఉద్యోగాలను సృష్టించేలా అమలుచేస్తున్నాం. అత్యధిక మందికి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మా ప్రభుత్వం పనిచేస్తున్నది’ అని వివరించారు. 

అయోధ్యలో అసలైన దీపావళి

అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠాపన తర్వాత జరుపుకొంటున్న మొదటి దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ దీపావళి మనకు ఎంతో ప్రత్యేకమైనది. అయోధ్యలో రాము డు తిరిగి కొలువుదీరిన తర్వాత జరుపుకొంటున్న మొదటి దీపావళి ఇది. ఎన్నో తరాలు గడిచిపోయిన తర్వాత ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రస్తుత తరంలో ఉన్న మనం ఎంతో అదృష్టవంతులం. ఎందుకంటే ఈ గొప్ప ఉత్సవాల్లో మనం కూడా భాగస్వాములం అవుతున్నాం’ అని మోదీ పేర్కొన్నారు. 

ఏబీ వల్ల చేకూరే ప్రయోజనాలు

ఏబీ పథకానికి దేశంలోని 70ఏళ్లు పైబడిన వృద్ధులందరూ అర్హులే. ఇందుకోసం వాళ్ల సామాజిక, ఆర్థిక స్థితిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోదు. ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్(సీజీహెచ్‌ఎస్), ఎక్స్ సర్వీస్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్‌ఎస్), ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్స్ (సీఏపీఎఫ్) వంటి ఇతర పబ్లిక్ లేదా ప్రవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందుతున్నట్లయితే ఏబీపీఎంజేఎవై కింద ప్రయోజనం పొందడం పొందకపోవడం వాళ్ల ఇష్టంపైన ఆధారపడి ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ పథకంలో రిజిస్టరైన వృద్ధులు ఇందులో చేరడం ద్వారా రూ.5లక్షల ఆరోగ్య భీమా ప్రయోజనాన్ని అదనంగా పొందుతారు. అయితే ఒక కుటుంబంలో 70ఏళ్లపైబడిన వారు ఇద్దరు ఉంటే వారికి సగం, సగం ప్రయోజనం వర్తిస్తుంది. పథకం ద్వారా ప్రయోజనం పొందాలనుకునే వాళ్లు పీఎంజేఏవై పోర్టల్ లేదా ఆయుష్మాన్ పోర్టల్‌లో రిజిస్టర్ కావాలి. గతంలో ఆయుష్మాన్ కార్డును కలిగిన వాళ్లు కూడా మరోసారి దరఖాస్తు చేసుకుని, ఈకేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. 

వృద్ధులకు వరం జన్ ఆరోగ్య యోజన

ఆయుష్మాన్ భారత్‌లో భాగ ంగా తీసుకొచ్చిన ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన’ (ఏబీ పథకం దేశంలోని ఆరుకోట్ల మందికిపైగా వృద్ధులకు వరంగా మారుతుందని ప్రధాని మోదీ అన్నా రు. ఆయుష్మాన్ భారత్‌లో ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు చేరకపోవటం వల్ల ఆయా రాష్ట్రాల్లోని వృద్ధులకు తీవ్ర నష్టం కలుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. వ్యక్తగత రాజకీయాల కోసం ఆయా ప్రభుత్వాల పాలకులు ప్రజలకు నష్టం కలిగిస్తున్నారని విమర్శించారు. ‘మీ రు (వృద్ధులు) ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసు. కానీ మీకు నేను సహాయం చేయలేకపోతున్నాను. దానికి కారణం మీ రాష్ట్ర ప్రభుత్వాలే. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు ఈ పథకంలో చేరడం లేదు. మీ ప్రభుత్వాలు చేస్తున్న తప్పు వల్ల మీకు ఈ ప్రయోజనం అందకుండా పోతుంది. అందుకు మిమ్మల్ని నేను క్షమాపణలు కోరుతున్నా. దేశంలోని ప్రజలందరికీ నేను సేవ చేయగలను. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం నేను మీకు సేవ చేయడానికి వీలు లేకుండా ఆప్, తృణముల్ ప్రభుత్వాలు నన్ను అడ్డుకుంటున్నాయి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.