03-04-2025 11:20:00 PM
సిఐటియు వేజ్ బోర్డు సభ్యులు మంద నరసింహ రావు..
మంచిర్యాల (విజయక్రాంతి): ఏప్రిల్ 1, 2025న పెన్షన్ నిధికి టన్నుకు మరో రూ.10 చొప్పున బొగ్గు సంస్థల యాజమాన్యాలు అదనంగా ఇచ్చేందుకు అంగీకరించాయని సిఐటియు వేజ్ బోర్డు సభ్యులు సభ్యులు మంద నరసింహారావు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సిఐటియు, ఏఐటియుసి, హెచ్ఎంఎస్, యూనియన్ ల ఒత్తిడి మేరకు పది రూపాయలు అదనంగా ఇచ్చేందుకు అంగీకరించాయని ఆన్నారు.
పెన్షన్ ఫండ్ పెంచాలని చాలా కాలంగా పెన్షన్ నిధి స్థిరత్వం గురించి జాతీయ కార్మిక సంఘాలు ఆందోళనలు చేపట్టినట్లు ఆయన గుర్తు చేశారు. ఫిబ్రవరి 2024లో జరిగిన సమావేశంలో చేసిన తీర్మానం మేరకు జూన్ 2024లో బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అధ్యక్షతన కమిటీ ఏర్పడిందని, దీనిలో యూనియన్ల తరపున సిఐటియు సభ్యుడు డిడి రామానందన్ ను నియమించామని తెలిపారు.
కమిటీ మొదటి సమావేశం జూలై 2024లో జరుగగా ఈ సమావేశంలో యాజమాన్యం తరపున ఆచూరి, సిఎంపిఎఫ్ పిపిటి ద్వారా ఇచ్చిన ప్రజెంటేషన్ లో పెన్షన్ తగ్గించాలని ప్రతిపాదించగా దీనిని డిడి రామానందన్ తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. దీనిపై భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, యూనియన్ నాయకులందరినీ ఇందులో చేర్చాలని డిమాండ్ చేయడంతో ఏకాభిప్రాయం కుదిరిందని ఆన్నారు. కమిటీ సమావేశంలో ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సిఐటియు ప్రతినిధులు స్పష్టంగా "పెన్షన్ ఇవ్వడం యజమాని బాధ్యత" అని పట్టుబట్టడంతో పెన్షన్ ఫండ్ కు 10 రూపాయలు అదనంగా ఇచ్చేందుకు ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. అదనంగా ఇచ్చే పది రూపాయలు ఏప్రిల్ 16 2025 నుండి అమలు లోకి వస్తుందన్నారు. ఈ సమావేశం లో సిఐఎల్ డైరెక్టర్ (హెచ్చార్), డైరెక్టర్ ఫైనాన్స్ పాల్గొన్నారు.