calender_icon.png 30 January, 2025 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్‌కు అండగా ఉద్యోగులు

29-01-2025 01:37:43 AM

కరీంనగర్, జనవరి 28 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి అండగా టీఎన్జీవోలు, ఎంప్లాయిస్ జీఏసీలు అండగా నిలిచాయి. ఇటీవల కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పర్యటన సందర్భంగా రాష్ర్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వేదికపై జరిగిన తోపులాట అంశంపై అసహనం వ్యక్తం చేసి కలెక్టర్ పై తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంగళవారం ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉద్యోగులు కలెక్టరుకు అండగా నిలిచారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాజకీ యపక్షాలను, ప్రజాప్రతినిధులను కలుపుకుని ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజ ల్లోకి తీసుకుపోతున్న కలెక్టర్ చిరునవ్వుతో సమస్యలను పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నారని జేఏసీ పేర్కొంది.

కలెక్టర్ కు జరిగిన అవమానానికి ప్రతి ఉద్యోగి కన్నీరు పెడుతున్నారని, సహనాన్ని కోల్పోయి పరుషపదజాలంతో విరుచుకుపడడం మంత్రికి తగదని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలకు ఎవరు పాల్పడిన మా ఉద్యోగుల ఉసురు తగిలి మట్టి కొట్టుకుపో తున్నారని పేర్కొన్నారు. కలెక్టర్పై మాట్లాడిన మాటలు విత్ డ్రా చేసుకోవాలని, లేని పక్షంలో భవిష్యత్లో మా మద్దతు మీకు ఉండదని, పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.

ఈ అంశాన్ని రాష్ర్ట ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏచూరి శ్రీనివా స్రావుతోపాటు నాయకుల దష్టికి తీసుకెళ్లినట్లు దారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇలాంటి చర్యలు పునరావతం కావద్దని, ఇలా వ్యవహరిస్తే ఉద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని ఎన్జీవో  రాష్ర్ట నాయకులు హెచ్చరించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో  టీఎన్టీవోల సంఘం జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మడిపెల్లి కాళీచరణ్, కార్యదర్శి అరవింద్ రెడ్డి, నాగరాజు, కేంద్ర సంఘం ఉపాధ్యక్షులు నాగుల నరసింహస్వామితోపాటు టీఎన్టీవో అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.