25-02-2025 12:00:00 AM
మెదక్, ఫిబ్రవరి 24(విజయక్రాంతి): పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని డిఆర్డిఏ పిడి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం మెద క్ కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో పలువురు ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నా రు. ఈ సందర్భంగా డిఆర్డిఏ పిడి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో 118 ఉద్యో గులు పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించాల్సి ఉండగా ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కలెక్టరేట్ ఆవరణలో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో 65 మంది వినియోగించుకున్నారని తెలిపారు. ఓటింగ్ పూర్తయ్యే వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల డిప్యూటీ తహసిల్దార్ నవీన్ సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.