24-02-2025 12:00:00 AM
కరీంనగర్, ఫిబ్రవరి 23 (విజయ క్రాంతి): పోస్టల్ బ్యాలెట్ ఓటుహక్కును ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని రిటర్నింగ్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫెసిలిటీ కేంద్రంలో పలువురు ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సెంటర్ ను కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
కలెక్టరేట్ ఆవరణలో ఓటర్ ఫెసలిటేషన్ సెంటర్ ఈనెల 24 వరకు ఓటు వేయాలని సూచించారు. వోటింగ్ పూర్తి ఐయ్యేంత వరకు సిబ్బంది అప్రమత్తం గా ఉండాలి అని తెలిపారు. ఓటింగ్ వివరాలను డీఆర్డీఓ, నోడల్ ఆఫీసర్ శ్రీధర్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రపుల్ దేశాయ్, హార్టికల్చర్ డీడీ శ్రీనివాసరావు, యాదగిరి, ఇతర అధికారులు ఉన్నారు.