24-02-2025 12:09:23 PM
కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం ఉంచండి: మంత్రి పొన్నం
స్థానికత్వం అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మా బాధ్యత నిర్వహిస్తున్నాం
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) 317 జీవోను ప్రస్తావిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. 317 జీవో సబ్ కమిటీ సభ్యుడిగా ఇప్పటికే స్పౌజ్ కేసులు గానీ, హెల్త్, మ్యూచువల్ కి సంబంధించిన వారిని ట్రాన్స్ఫర్ చేశామని వెల్లడించారు. స్థానికత అంశం కేంద్రం పరిధిలో ఉందని ఆయన తెలిపారు. జోనల్ మార్పులపై కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నామని పేర్కొన్నారు.
వచ్చే సమావేశాల్లో స్థానికతపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని మంత్రి వివరించారు. జీవో 317(GO- 317) సమస్య పరిష్కరిస్తామని ఎన్నికల ముందు చెప్పామని తెలిపారు. ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం ఉంచాలని పొన్నం ప్రభాకర్ కోరారు. 317 జీవోపై ఇప్పటికే అనేక సమావేశాలు నిర్వహించామన్న మంత్రి పొన్నం ఉద్యోగులకు అనుకూలంగా పరిష్కరించే బాధ్యత తమదన్నారు. ఇప్పటికే దాని మీద దామోదర రాజనర్సింహ(Damodara Raja Narasimha) నాయకత్వంలో శ్రీధర్ బాబు, తాను 317 జీవో పైన అనేక సమావేశాలు ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. ఇటువంటి సున్నితమైన అంశాన్ని ఎన్నికల్లో రాజకీయాల(politics)కు ఉపయోగించుకోవడం పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు.