నారాయణపేట, జనవరి 4(విజయ క్రాంతి) : నారాయణపేట మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ,ఔట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు వెంక ట్రామరెడ్డి, జిల్లా కార్యదర్శి బాల్ రామ్ డిమాండ్ చేశారు.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని మునిసిపల్ కార్యాలయం దగ్గర యూనియన్ కోశాధికారి సాయిలు అధ్యక్షతన జరుగుతున్న కార్మికుల నిరసన దీక్షలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయల వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మునిసిపల్ కమిషనర్ సునీతకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సాయిలు, మల్లేష్ నారాయణ.వెంకటేష్ తదితర కార్మికులు పాల్గోన్నారు.