calender_icon.png 12 December, 2024 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హక్కులు సాధించే వరకు సమ్మెకు సాగిస్తాం

12-12-2024 07:23:51 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): హక్కులు సాధించే వరకు సమ్మెను కొనసాగిస్తామని సమగ్ర శిక్ష ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షురాలు శృతిక అన్నారు. ఉద్యోగ భద్రత కోసం చేపడుతున్న సమ్మె గురువారంకు చేరుకుంది. ఉద్యోగులు టీ కప్పులతో నిరసన తెలిపారు. సమ్మె చేపడుతున్న సమగ్ర శిక్ష విద్యలకు ప్రజా సంఘాల నాయకులు మద్దతు పలికారు. న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగ సుధా, తుకారం, నగేష్, సంతోష్, కవిత, రమాదేవి, పద్మ, రవీందర్, సందీప్, పవన్, అనుప్, ప్రశాంత్, వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.