మునగాల,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులపై జరిగిన దాడిని ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ తీవ్రంగా ఖండించారు. మునగాల మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయములో భోజన విరామ సమయములో ఎంపీడీఓ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద దాడికి నిరసనగా ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ... ఈ దాడి ప్రజాస్వామ్య విలువలకు చేటు. ప్రభుత్వము తక్షణమే చర్యలు తీసుకొని దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజా సేవకుల రక్షణ కొరకై ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ చట్టం ద్వారా దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షలు విధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.