15వ రోజుకు చేరిన సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె
నిర్మల్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): తమ డిమాండ్‌లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట చేస్తున్న నిరవ ధిక సమ్మె మంగళవారం నాటికి 15 రోజుల కు చేరుకుంది. 15 రోజులుగా సమ్మె చేస్తు న్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఉద్యోగులు మంగళవారం వినూత్నంగా దీక్ష శిబిరం వద్ద జ్యోతిషం చెప్పించుకుని నిరసన వ్యక్తం చేశారు. సమ్మక్క సారలమ్మ జ్యోతిష పండితులను పిలిపించుకొని శిబిరం వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మనస్సు కరగా లని, సమ్మక్క, సారలమ్మ తల్లుల దయ ఉద్యోగులపై ఉండాలని కోరుకున్నారు. దీక్ష శిబిరానికి పలు ఉద్యోగ సంఘాల నేతలు, పార్టీ నాయకులు చేరుకుని ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు.ఈ