calender_icon.png 18 January, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షంలో గొడుగులు పట్టుకొని ఉద్యోగుల నిరసన

01-09-2024 01:28:46 PM

యాదాద్రిభువనగిరి, (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా TGEJAC ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 న పెన్షన్ విద్రోహదినం పురస్కరించుకుని  సిపిఎస్, యుపిఎస్ రద్దు చేసి ఒపిఎస్ ను పునరుద్దరించాలని కోరుతూ తెలంగాణ ఉద్యోగులు,గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (టిజిఇ జెఎసి) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా జెఎసి స్టీరింగ్ కమిటీ  నిర్ణయానుసారం యాదాద్రి భువనగిరి జిల్లా తహసీల్ ఆఫీస్ భువనగిరి వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం మందడి ఉపేందర్ రెడ్డి అధ్యక్షులు TGO యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. పదవి విరమణ చేసిన OPS ఉద్యోగుల బాధలు వర్ణాతీతం అని అన్నారు. వెంటనే ops పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘo, యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి, కొల్పుల రమేష్, అస్సోసియేట్ అధ్యక్షులు విజయ్ మరియు సభ్యులు నాల్గవ తరగతి ఉద్యోగులు,  TNGO యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు భరత్, కార్యదర్శి ఖదీర్, PRTU మండల అధ్యక్షులు మనోరంజన్ రెడ్డి, UTF మండల కార్యదర్శి వెంకటేష్, యాదాద్రి భువనగిరి జిల్లా పెన్షన్ సంఘము భాద్యులు మోహన్ రెడ్డి, ఆనందం, కిష్టయ్య, సోదర ఉద్యోగ సంఘ భాద్యులు పాల్గొన్నారు.