calender_icon.png 2 April, 2025 | 12:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగుల పీఎఫ్, ఈఎస్‌ఐ సకాలంలో చెల్లించాలి

28-03-2025 02:02:04 AM

వారధి సర్వసభ్య సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి 

కరీంనగర్, మార్చి27 (విజయ క్రాంతి): వారధి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరి ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్‌ఐ క్రమం సకాలంలో చెల్లించాలని సొసైటీ చైర్ పర్సన్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ వారధి సొసైటీ పదవ వార్షిక సర్వసభ్య సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జరిగింది. 

కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో వారధి సొసైటీ 2015 లో ప్రారంభమైందని అన్నారు. ఇప్పటివరకు 85 వేల 129 మంది ఉపాధి, ఉచిత శిక్షణ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని తెలిపారు. వారధి సొసైటీ ఆరు జిల్లాల పరిధిలో సేవలు అందిస్తోందని అన్నారు.

సొసైటీలో ఉన్న ఉద్యోగులందరికీ సకాలంలో ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్‌ఐ చెల్లించాలని సూచించారు. 2 వేల 997 మంది ఈ సంస్థ ద్వారా ప్రత్యక్ష ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ ఏడాది 186 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించినట్లు పేర్కొన్నారు.  కార్యక్రమంలో డిఆర్‌ఓ వెంకటేశ్వర్లు, డి ఆర్ డి ఓ శ్రీధర్, జడ్పీ సీఈవో శ్రీనివాస్, వారధి సొసైటీ మెంబర్ సెక్రటరీ ఆంజనేయులు, సంస్థ సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.