calender_icon.png 17 November, 2024 | 5:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంప్లాయీస్ హెల్త్‌స్కీం అమలుచేయాలి

19-09-2024 02:39:32 AM

మంత్రి రాజనర్సింహకు ఉద్యోగుల జేఏసీ వినతి

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యుల కోసం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి విజ్ఞప్తి చేశారు. నూతన ఈహెచ్‌ఎస్ విధానం అమలు కోసం వివిధ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి  రూపొందించిన ముసాయిదాను బుధవారం సచివా లయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు అందజేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న హెల్త్ స్కీంలో ఉన్న లోటుపాట్లు, కొత్తగా ప్రతిపాదించిన హెల్త్ స్కీంతో ఉద్యోగులు, వారి కుటుంబాలకు కలిగే ప్రయోజనాలను మంత్రికి వివరించినట్లు లచ్చిరెడ్డి తెలిపారు. 317జీవోను రద్దు చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని ఆయ న ఈ సందర్భంగా మంత్రిని కోరారు.