calender_icon.png 14 November, 2024 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్, తహశీల్దార్లపై దాడి.. విధులు బహిష్కరించిన ఉద్యోగులు

12-11-2024 11:24:42 AM

వికారాబాద్,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లాలో ఉద్యోగులు మంగళవారం విధులను బహిష్కరించారు. సోమవారం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ ఎం.సుధీర్, తహసీల్దార్, అధికారులపై గ్రామస్తులు చేసిన దాడి ఘటనలో ఇప్పటీకే 28 మందిని అరెస్టు చేశారు. ఫార్మా కంపెనీ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ కోసం లగచర్లకు వెళ్లిన అధికారులపై దాడి చేశారు. దీంతో వికారాబాద్ జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులు తమ విధులను బహిష్కరించారు. మిగిలిన జిల్లాల్లో నల్లబ్యాడ్జీలతో ఉద్యోగులు విధులకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు.

దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా కంపెనీ కోసం భూసేకరణ ప్రక్రియ చేసేందుకు జిల్లా కలెక్టర్ గ్రామసభను ఊరికి దూరంగా సభను ఏర్పాటు చేశారు. దీంతో ఆగ్రహంతో ఉగిపోయిన గ్రామస్తులు అధికారులు ఊర్లోకి రాగానే వారిపై  దాడికి దిగారు. వికారాబాద్ అడిషనల్ కలెక్టర్, కేఎడీఎ ఛైర్మన్, ఇతర అధికారులపైన జరిగిన దాడిలో ప్రత్యేక్షంగా గాని పరోక్ష్యంగా గాని పాల్గొన్నవారిని ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఐజీ వి.సత్య నారాయణ తెలిపారు.