నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క(Minister Sitakka) సమావేశం నేపథ్యంలో పోలీసులు కలెక్టర్ కార్యాలయం వద్ద విధించిన ఆంక్షలు ఉద్యోగులకు పౌరులకు ఇబ్బంది కలిగించాయి. కలెక్టర్ కార్యాలయానికి వివిధ పనుల కోసం వెళ్లవలసిన వారు విధులు ముగించుకొని బయటకు వెళ్లవలసిన వారు లోనికి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో గంటల తరబడి అక్కడే వేచి ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది.