calender_icon.png 26 December, 2024 | 12:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

27-07-2024 02:06:59 AM

రాచకొండ సీపీ సుధీర్‌బాబు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 26 (విజయక్రాంతి): రాచకొండ కమిషనరేట్ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ రెండో సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం నేరేడ్‌మెట్‌లోని కమిషనర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సీపీ సుధీర్‌బాబు మాట్లాడుతూ.. రాచకొండ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సిబ్బంది సంక్షేమం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామ న్నారు. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సర్వసభ్య సమావేశం నిర్వహించి వారి అవసరాలు తెలు సుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు.  ఈ సంవత్సరం కూడా ఎజెండాలో పేర్కొన్న పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని వాటి అమలుకు ఆదేశాలు జారీ చేసినట్లు సీపీ తెలిపారు.

ఉన్నతా ధికారులకు, సభ్యులకు మధ్య వారధిగా ఉంటూ సిబ్బంది సంక్షేమం కోసం పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని సొసైటీ సిబ్బం దికి సూచించారు.  ఈ ఏడాది నుంచి సభ్యు ల మరణానంతరం అంత్యక్రియలకు అందిం చే డబ్బును రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వరకు, పదవీ విరమణ సమయంలో అందించే డబ్బును రూ. 30 వేల నుంచి రూ. 40 వేలకు పెంచినట్లు తెలిపారు. సమావేశంలో సొసైటీ వైస్ ప్రెసిడెం ట్ డీసీపీ అడ్మిన్ ఇందిర, సెక్రటరీ ఎస్బీ శ్రీధర్‌రెడ్డి, ట్రెజరర్ బాలరాజ్, డైరెక్టర్లు జంగ య్య, రవీందర్‌రెడ్డి, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు సీహెచ్ భద్రారెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.