హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 23(విజయక్రాంతి): టీజేఈయూ (తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్)తో ఉద్యోగుల సమస్యలు తీరుతాయని, తమ సంఘంపై నమ్మకంతో ఉద్యోగులు భారీగా తమ యూనియన్లో చేరుతున్నారని టీజేఈయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సతీష్, రాఘవేంద్ర రాజ్ పేర్కొన్నారు. శనివారం తమ యూనియన్లో జలమండలి ఓఅండ్ఎం డివిజన్లోని దా దాపు 100 మంది చేరినట్లు చెప్పా రు. తమ సంఘం గౌరవ అధ్యక్షుడు మధుయాష్కీగౌడ్కు ప్రభుత్వంతో ఉన్న స త్సంబంధాల కారణంగా సమస్యలు తీ ర్చగలమనే నమ్మకంతో తమ సంఘం వైపు ఆకర్షితులవుతున్నారని చెప్పారు.