అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా
ఎమ్మెల్యే కాటెపల్లి వెంకటరమణారెడ్డి
కామారెడ్డి, డిసెంబర్ 6 (విజయక్రాంతి): ‘ఉద్యోగులకు ఏమీ చేయలేని సీఎం ప్రజలకు ఏం మేలు చేస్తారు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే అసెంబ్లీ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేస్తా’ అని కామారెడ్డి ఎమ్మెల్యే కాటెపల్లి వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట శుక్రవారం సమగ్ర సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చేపట్టిన నిరసన దీక్షకు ఎమ్మెల్యే సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతు పండుగ పేరుతో రైతులను.. యువ వికాసమంటూ యువతను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్‌ను ప్రభుత్వం వెంటనే వారి ఖాతాల్లో జమ చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను నెరవే ర్చాలన్నారు.
అంతకుముందు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆకుల భారత్‌కుమార్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీకాంత్, కౌన్సిలర్లు నరేందర్, శ్రీనివాస్, నాయకులు లక్ష్మారెడ్డి, నరేందర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, శ్రీనివాస్, రిటైర్డ్ ఉద్యోగులు, సమగ్రశిక్ష అభియాన్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.