calender_icon.png 25 October, 2024 | 2:44 AM

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

25-10-2024 12:42:48 AM

  1. సీఎం దృష్టికి తీసుకెళ్లిన టీజేఏసీ నేత లచ్చిరెడ్డి
  2. కామన్ సర్వీస్ రూల్స్ తీసుకువస్తామన్న రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాం తి):  దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డిని లచ్చిరెడ్డి ఆధ్వర్యంలోని టీజేఏసీ నేతలు విజ్ఞప్తి చేశా రు. గురువారం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో సీఎం సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. 317 అంశంపై క్యాబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫారసు చేసిన అంశాలను అమలు చేస్తామని వారితో సీఎం అన్నారు. ఉద్యోగుల ఈహెచ్‌ఎస్‌కు సంబంధించి ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌తో అన్ని హాస్పిటల్లో చెల్లుబాటు అయ్యే విధంగా హెల్త్‌కార్డ్స్ ఇచ్చి ఈ ప్రక్రియను డిసెంబర్ 9 లోపు పూర్తి చేస్తామన్నారు.

ఎంప్లాయిస్ హౌసింగ్ సొసైటీ కింద ల్యాండ్ పూలింగ్ చేసి జిల్లా కేంద్రాలతోపాటు హైదరాబాద్‌లో ఐదు వేల ఎకరాలు సేకరించి ఇన్‌ఫ్రాస్ట్రెక్చర్ డెవలప్ చేసి ప్రభుత్వ రేట్ల ప్రకారం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చేలా చర్యలు చేపడతామన్నారు. సమావేశంలో జేఏసీ నేతలు లచ్చిరెడ్డి, హన్మంతరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.