నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా అభివృద్ధిలో ఉద్యోగుల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో ఉద్యోగులు చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ జిల్లా టీఎన్జీవో 4వ తరగతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ ను కలిసి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపి నోటు పుస్తకాలను ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రభాకర్, రవికుమార్, ఉద్యోగ సంఘ నాయకులు అశోక్, రమణ, శ్రీనివాస్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.