* పట్టుకున్న పోలీసులు
నిర్మల్, జనవరి 29 (విజయక్రాంతి): జిల్లాలో రెవెన్యూ శాఖలో డీటీ స్థాయి అధికారి ఓ మహిళతో అపర్ణ టౌన్‌షిప్‌లోని ఓ ఇంటిలో ఉన్నట్టు స్థానికులు గుర్తించి మీడియాకు, పోలీసులకు సమాచా అందించారు. మీడియా, పోలీసులు అ చేరుకుని గదిలో మహిళతో ఉన్న దృచిత్రీకరిస్తుండగా డీటీ వారిపై మంవివాహితను గదిలోనే ఉంచి బయటకు వెళ్లి మిత్రుడి సహాయంతో కారు వెళ్లిపోయారు.
పట్టణ సీఐ ప్రవీణ్‌కుమా సాయంతో సిబ్బంది గది తాళాలు పగులగొట్టి, వివాహితను భరోసా కౌన్సెలింగ్ కేం నా తరలించినట్లు తెలుస్తోంది. సదరు అధికారి అక్కడి నుంచి నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి విధులకు హాజరైనట్టు సమాచారం. కాగా జర్నలిస్టులు తీసిన వీడియోలను పోలీసులు ఫోన్లు లాక్కొని తొలగించారు.
దీంతో సదరు అధికారి తీరుపై రెవెన్యూ శాఖలోనే పలు విమర్శలు వినిపిస్తున్నాయి. సదరు అధికారి ఇసుక వ్యాపారం చేస్తున్న కొందరిని వేధించడం వల్లనే వారు పథకం ప్రకారం నిఘా ఉంచి మహిళతో ఉండగా మీడియా, పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలుస్తున్నది. విచారణ జరుగుతోందని పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.