calender_icon.png 31 January, 2025 | 4:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూపీఎస్‌తో ఉద్యోగి భవిష్యత్‌కు ఉరే

29-01-2025 12:58:32 AM

  • సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ 
  • రాష్ట్రవ్యాప్తంగా యూపీఎస్ ప్రతుల దహనం 

హైదరాబాద్, జనవరి 28 (విజయక్రాం తి): కేంద్రం యూనిఫైడ్ పెన్షన్ స్కీం (యూపీఎస్) విధానంపై ఇటీవల జారీచేసిన నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ  ఉపాధ్యాయు లు, ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కార్యాలయాల్లో మంగళవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం), యూపీఎస్ ప్రతులను దహనం చేశారు.

సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, రాష్ర్ట కోశాధికారి నరేశ్‌గౌడ్ హైదరాబాద్ అబిడ్స్‌లోని బీమా భవన్‌లోని  సీపీఎస్ స్టేట్ నోడల్ కార్యాలయం ఎదుట యూపీఎస్ ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ మాట్లాడుతూ.. యూపీఎస్ ఉద్యోగి భవిష్యత్తుకు ఉరిలాంటిదేనన్నారు.

పాత పెన్షన్ (ఓపీఎస్) విధానంలో ఉద్యోగి తన జీపీఎఫ్‌లో దాచుకున్న సొమ్మును ఉద్యోగ విరమణ చెందిన తర్వాత తిరిగి వందశాతం ఇస్తారని, అదే సీపీఎస్ విధానంలో 60 శాతం తిరిగి ఇస్తారని, కానీ యూపీఎస్‌లో మొత్తం సొమ్ము ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు.

కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన యూపీఎస్ నోటిఫికేషన్‌ను రాష్ర్ట ప్రభుత్వం వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. యూపీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 7న బెంగళూరు ఫ్రీడమ్ పార్క్‌లో ధర్నా, మార్చి 2న చలో ధర్నా చౌక్ పేరిట హైదరాబాద్‌లో నిరసన కార్యక్రమం ఉంటుందని, ఉద్యోగ, ఉపాధ్యాయులు భారీగా తరలివచ్చి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.