ఒక వ్యక్తితో గాఢ ప్రేమలో ఉన్నారని తెలియజేయడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి. నిజమైన ప్రేమలో షరతులు ఉండవు.. కేవలం అంగీకారాలు మాత్రమే ఉంటాయి. ఎదుటివ్యక్తి తప్పు చేసినా అంగీకరించగలగడం, వారు ఏది చేయాలనుకున్న దానికోసం ఎమోషనల్ సపోర్టు చేయాలనిపించడం నిజమైన ప్రేమ.
ప్రేమించిన వ్యక్తి ఆలోచనలను, భావాలను చెప్పకుండా గ్రహించడం అర్థం చేసుకోవడం. ఇలాంటి లక్షణాలు అవతలి వ్యక్తితో గాఢమైన ప్రేమలో ఉన్నారనడానికి ఒక రకమైన సంకేతం. నిజమైన ప్రేమ ఎప్పుడూ కూడా ప్రేమించిన వ్యక్తి శ్రేయస్సును కోరుకుంటారు. నిజమైన ప్రేమలో భాగస్వాములు ఇద్దరు కలిసి వృద్ధి చెందాలని కోరుకుంటారు.
చేసేప్రతి పనిలో మద్దతుగా నిలబడతారు. ఇలాంటి లక్షణాలు ప్రేమలో కూడా కనిపిస్తే.. వారు మీతో గాఢమైన ప్రేమలో ఉన్నారని అర్థం. రిలేషన్ షిప్‌లో ప్రియారిటీస్ అనేవి చాలా ముఖ్యం. ఎంత బిజీగా ఉన్నా.. మీ కోసం ఎదురుచూసే మీ భాగస్వామి కోసం కాస్త సమయం అయినా కేటాయించాలి.