Emmy Awards: ఎమ్మీ అవర్డు ప్రధానోత్సవ వేడుకలో భాగంగా ఓ నటుడు వినూత్నంగా నిరసన తెలిపారు. సినీ పరిశ్రమ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే 76వ ఎమ్మీ అవార్డు ప్రధానోత్సవ వేడుక లాస్ ఏంజల్స్ యూఎస్ లోని పికాక్ థియేటర్ వేదికగా ఘనంగా జరిగింది. రిజర్వేషన్ డాగ్స్ నటుడు డిఫరో వూన్ ఏ తాయ్.. పవర్ ఫుల్ సందేశం ఇచ్చారు. తన ముఖంపై ఎరుపు రంగు చేతి గుర్తు ముద్ర వేసుకుని.. మిస్సింగ్ అండ్ మర్డర్డ్ ఇండీజీనస్ విమెన్(ఎంఎంఐడబ్లూ) మూవ్ మెంట్ కు వినూత్నంగా నిరసన తెలిపారు. కెనడా, అమెరికాలో స్థానిక మహిళలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలు, వారు ఎదుర్కొంటున్న పరిస్థితులపై అవగాహన పెంచుతూ, ఈ మూవ్ మెంట్ కు మద్దతు కూడగట్టాలనే ఉద్దేశ్యంతో ఈ కెనడా నటుడు ఇలా ప్రత్యేకంగా వచ్చారు. దాంతో ఆయనపై ప్రశంసల వర్షం కురిసింది. సామాజిక న్యాయంపై ఆయన చూపిన నిబద్ధతను నెటిజెన్లు కొనియాడారు.