calender_icon.png 15 November, 2024 | 12:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జ్యోతిష్మతిలో ఎమర్జింగ్ టెక్నాలజీ విభాగం

31-08-2024 02:10:14 AM

కరీంనగర్, ఆగస్టు 30 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని జ్యోతిష్మతి ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అటానమస్ కళాశాలలో శుక్రవారం ఎస్‌ఏపీ ల్యాబ్స్ ఇండియా ఆధ్వర్యం లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఎమర్జింగ్ టె క్నాలజీస్ విభాగాన్ని ప్రారంభించారు. జ్యోతిష్మతి కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్‌రావు, కరస్పాండెంట్, సెక్రటరీ జువ్వాడి సుమిత్‌సాయిలు జ్యోతిష్మతి ప్రజ్వలన చేసి విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. సాప్ ల్యాబ్‌లు ప్రయోగాత్మకంగా శిక్షణ అందించేందుకు రూ.30 లక్షల తో జిట్స్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు.

విద్యార్థులకు ఉపాధి కల్పించడానికి కోడ్ ఉన్నతి ప్రోగ్రాం ద్వారా పరిశ్రమకు సంబంధించిన నైపుణ్యా ల ప్రాముఖ్యతను, భవిష్యత్‌లో ఉద్యోగాల కోసం విద్యార్థులను సిద్ధం చేయడం, నూ తన మార్గాలను సృష్టించడానికి ఈ విభాగా న్ని ప్రారంభించినట్టు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్ రెడ్డి, మహ్మద్ అఫ్సర్ పాషా, గంగాప్రసాద్, ప్రిన్సిపాల్ డాక్టర్ కేఎస్ రావు, డీన్ డాక్టర్ పీకే వైశాలి, తదితరులు పాల్గొన్నారు.