కరీంనగర్, (విజయక్రాంతి): ఎంపి కంగనా రనౌత్ దర్శకత్వం వహించి నిర్మించిన ఎమర్జెన్సీ సినిమా సిక్కుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని సిటీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సర్దార్ దన్నసింగ్ ఆధ్వర్యంలో ఏసిపి నరేందర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దన్నసింగ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో సిక్కుల చరిత్రను తప్పుగా చూపించడమే కాకుండా సిక్కులను తీవ్రవాదులుగా, విభజన వాదులుగా చూపించారని అనేక సిక్కు వ్యతిరేక దృశ్యాలు ఉన్నాయి. వెంటనే ఈ సినిమా బ్యాన్ చేయాల్సిందిగా ఏసిపీని కోరామని అన్నారు.ఈ కార్యక్రమంలో అబ్దుల్ రెహమాన్,కిషన్ సింగ్,ఆమేర్,జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.