calender_icon.png 23 November, 2024 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీలో ఎమర్జెన్సీ

23-11-2024 02:56:13 AM

కాలుష్యం కూడా అత్యవసర పరిస్థితే

ఈ విపత్తుపై పార్లమెంట్‌లో చర్చించాలి

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ, నవంబర్ 22: ఢిల్లీలోని వాయు కాలుష్యంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర భారతదేశంలోని వాయు కాలుష్యాన్ని జాతీయ అత్యవసర పరిస్థితిగా పేర్కొన్నారు. ఇండి యా గేట్ వద్ద పర్యవరణవేత్త ఝూతో కలిసి కాలుష్య సమస్యపై శుక్రవారం చర్చించారు. అందుకు సంబంధించిన వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ విపత్తును అంతం చేసేందుకు అవసరమైన పరిష్కార మార్గాలపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చర్చించాలని తోటి ఎంపీలను కోరారు.

రాజకీయ విమర్శలకు చేసుకునేందుకు ఇది తగిన సమయం కాదని ఆయన పేర్కొన్నారు. కాలుష్య ప్రభావం వల్ల పర్యాటకం బాగా పడిపోయిందన్నారు.  

ఆంక్షలపై సుప్రీం అసంతృప్తి

ఢిల్లీలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్‌ఏపీ నిబంధనలను సక్రమంగా అమలు చేయకపోవడంపై శుక్రవారం సుప్రీ ంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నిషేధం ఉన్నప్పటికీ డీజిల్ ట్రక్కులు, బస్సులు స్వేచ్ఛ గా ఢిల్లీ రోడ్లపై తిరుగుతుండటం పట్ల ఆగ్ర హం వ్యక్తం చేసింది. కాలుష్య కట్టడి కోసం ఢిల్లీలోకి ప్రవేశించడానికి ఉన్న 113 మార్గాల వద్ద నిఘా తప్పనిసరిగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. జీఆర్‌ఏపీ ఆంక్షలు మరో మూడు రోజులపాటు కొనసాగుతాయని వెల్లడించింది. 

పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగించండి

ఢిల్లీలోని చాలా చోట్ల గాలి నాణ్యత ‘వెరీ పూర్’ కేటగిరీలోనే ఉంది. దేశ రాజధానిలో శుక్రవారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ)లో గాలి నాణ్యత 373గా నమోదైంది. ఆనంద్ విహార్, బవానా, ముండ్కా, వజీర్‌పూర్ వంటి కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత 400పైగా పడిపోయింది. ఈ క్రమంలోనే వాహనాల వల్ల కలిగే కాలుష్యాన్ని నివారించడానికి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులను ఉపయోగించుకోవాలని కేంద్ర సిబ్బంది మంత్రిత్వశాఖ ఉద్యోగులను కోరింది.