- ఎర్రోళ్ల అరెస్ట్ దుర్మార్గం
- బీఆర్‌ఎస్ నేత కేటీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారెం టీలను అటకెక్కించి, ఏడో గ్యారెంటీగా ఎమర్జెన్సీని సీఎం రేవంత్‌రెడ్డి అమలు చేస్తు న్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించా రు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. నోటీసులు కూడా ఇవ్వకుండా తెల్లవారుజామున ఇంటికెళ్లి భయబ్రాంతులకు గురిచేయ డాన్ని ఖండిస్తూ ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
అడిగితే అరెస్టులు.. ప్రశ్నిస్తే కేసులు - మంత్రి హరీశ్‌రావు ఫైర్
ఇది ఇందిరమ్మ రాజ్యమా? లేక పోలీస్ రాజ్యమా? అని ప్రభుత్వ తీరుపై మాజీమం త్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టుపై ఆయన గురువారం ఎక్స్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అడిగితే అరెస్టులు.. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని విమర్శించారు.
శ్రీనివాస్‌ను ఇంటికెళ్లి అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమ ని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పాలనని డబ్బా కొడుతూ, రాక్షస పాలనను కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.