నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఆవిర్భావ దినోత్సవం పట్టణంలోని ఎస్టీ భవన్లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి సంఘం జెండాను ఆవిష్కరించి జిల్లా అధ్యక్షులు గంగామణి నాయకులు సురేష్ కుమార్ మాట్లాడుతూ.. అంగన్వాడి సమస్యల పరిష్కారం కోసం సంఘం కురిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు లలిత, సునీత, నరసమ్మ, హేమలత, లావణ్య, భాగ్య తదితరులు పాల్గొన్నారు.