02-03-2025 12:00:00 AM
కుటుంబంలో భార్యాభర్తల విషయంలో ఏదో ఒక విషయంలో ఎప్పుడో ఒకప్పుడు అభిప్రాయ భేదాలు రావడం సహజం. వాటిని ఎలా పరిష్కరిస్తున్నారు అన్న దానిపైనే బంధం ఆధారపడి ఉంటుంది. ఇదొక ఆత్మీయ బంధం. ఒకరు లేనిదే రెండోవారు లేనట్టే ఉంటుంది. ఆ ప్రేమ జీవితాంతం కొనసాగాలంటే కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటంటే.. కొన్నిసార్లు మీ భాగస్వామి నుంచి బహుమతులు, సర్‌ప్రైజ్‌లు కోరుకుంటున్నారా.. అయితే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఒక్కోసారి కుదరకపోవచ్చు. అందుకు వారిని నిందించకుండా వారు చేసే చిన్న చిన్న పనుల్లో ఆత్మీయతను ఒడిసిపట్టుకోండి. సమయం దొరికినప్పుడు ఆనందంగా గడపండి.
పనుల ఒత్తిడిలో చిరాకులు భాగస్వామిపై చూపితే గొడవలూ ఘర్షణలూ తప్పవు. అందుకే నెమ్మదించండి. కోపానికి బదులు మీ బాధను, అంతర్మథనాన్ని వ్యక్తం చేయండి. పనుల్లో సాయం కావాలని అడగండి. పెళ్లి తర్వాత బాధ్యతల్లో పడి భాగస్వామిని ప్రేమించడం మర్చిపోతారు చాలామంది. కానీ పెళ్లి తర్వాత ప్రేమకు బలం ఎక్కువ. ఆధిపత్యం చెలాయించడం, అవమానించడం, అవహేళన చేయడం వంటి లక్షణాలను దూరం చేసుకుంటే బంధం కలకాలం నిలుస్తుంది.