విజిల్ ఫోక్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభం...
మందమర్రి (విజయక్రాంతి): విజిల్ ఫోక్ యూట్యూబ్ ఛానల్ ను, ఏం పిల్లడో వెళదాం వస్తావా పాట ప్రోమో ఆవిష్కరణను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పంచముఖి హనుమాన్ ఆలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నేతకాని మహార్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేష్ నేతకాని, అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు బండి సదానందం యాదవ్, అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి. పిల్లి రవి, కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు గుంట శ్రీశైలం ల చేతుల మీదుగా ఆవిష్క రించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నూతనంగా యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసిన కొరియోగ్రాఫర్, డైరెక్టర్ సునర్కార్ రాంబాబును అభినందించారు. ప్రధాన పాత్రలుగా ఉదారి చంద్రమోహన్ గౌడ్, సిరి, రావుల చారిలు జానపద పాటలో నటించడం జరిగిందని, యూట్యూబ్ లో జానపద పాటలను ప్రజలు చాలా ఆదరిస్తున్నారని రానున్న రోజులలో సందేశాత్మక లఘు చిత్రాలను తీయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పాట రచయిత విత్తనాల పేరు శ్రీనివాస్, ప్రొడక్షన్ ఇంచార్జి ముదారపు శేఖర్, శ్రావణ్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ సాయి, శ్రీరామ్ లు పాల్గొన్నారు.