20-04-2025 12:46:41 AM
మోదీతో సంభాషణ అనంతరం స్పష్టం చేసిన టెస్లా అధినేత
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: టెస్లా అధినేత ఎలా న్ మస్క్ భారత పర్యటనకు రానున్నారు. ఈ ఏడాది చివర్లో తాను భారత్‌కు రానున్నట్టు ‘ఎక్స్’ వేదికగా స్వయంగా వెల్లడించారు. ప్రధాని మోదీతో సంభాషణ అనంతరం మస్క్ తన భారత పర్యటనపై ‘ఎక్స్’లో పోస్టు పెట్టడం విశేషం. ప్రధాని మోదీతో సంభాషించడం గౌరవంగా భావిస్తున్నట్టు తన పోస్టులో పేర్కొన్నారు. మస్క్ పర్యటన అమెరికా, భారత్ మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది.
గతే డాది సార్వత్రిక ఎన్నికలకు ముందే మస్క్ భారత్‌లో పర్యటించాల్సి ఉన్నా చివరి నిమిషంలో తన ప్రయాణాన్ని వాయిదా వేసు కున్నారు. గతంలో నూ మస్క్ భారత పర్యటన అనేకసా ర్లు వాయిదా పడిం ది. కాగా మస్క్ నేతృత్వంలోని టెస్లా, స్టార్ లింగ్ సంస్థలు భారత విపణిలో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్న సంగ తి తెలిసిందే. దీనిలో భాగంగానే ఇప్పటికే షోరూమ్‌ల ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టిన ఆ సంస్థ..
భారత్ రోడ్లపై ‘మోడల్ వై’ కారును పరీక్షిస్తోంది. తాజాగా ముంబై జాతీయ రహదారిపై దర్శనమివ్వడం చూపరులను ఆకట్టుకుంది. టెలికాం కంపెనీలైన ఎయిర్‌టెల్, జియో ఇప్పటికే స్టార్ లింక్ సేవల కోసం స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం చేసుకున్నాయి. కేంద్రం నుంచి అనుమతులు రావాల్సిన సమయంలో మస్క్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.