16-02-2025 12:19:52 AM
న్యూయార్క్, ఫిబ్రవరి ౧౫: మ స్క్‌పై అమెరికా రచయిత్రి అష్లే సె యింట్ క్లెయిర్ సంచలన ఆరోపణ లు చేశారు. ఇటీవలే తనకు పుట్టిన బిడ్డకు తండ్రి మస్క్ అంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టడం గమనార్హం. ‘ఐదు నెలల క్రి తమే బిడ్డకు జన్మనిచ్చాను. మా బిడ్డ భద్రత, ప్రైవసీకి భంగం కలగకూడదనే ఇన్నాళ్లు ఈ విషయాన్ని దాచి పెట్టాను.
అయితే మీడియా ఈ విషయాన్ని బహిర్గతం చేయాలని ప్రయత్నించింది. అందు కే స్వయంగా నేనే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నా. మా సంతానం సురక్షిత వాతావరణంలో పెరగాలని కో రుకుంటున్నా. మా గోప్యతకు భం గం కలిగించొద్దు’ అని అష్లే వెల్లడించారు. అష్లే ఆరోపణలపై మస్క్ ఎలాంటి ప్రకటన చేయలేదు.