calender_icon.png 19 April, 2025 | 11:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్కతుర్తి బహిరంగ సభ కాంగ్రెస్ పతనానికి నాంది

17-04-2025 05:15:12 PM

సభకు ప్రతి వ్యక్తి కథానాయకులై కదలి రావాలి..

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..

హుజురాబాద్ (విజయక్రాంతి): ఎల్కతుర్తి బహిరంగ సభతో కాంగ్రెస్ పతనానికి నాంది పలకాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Padi Kaushik Reddy) అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో తలపెట్టిన బహిరంగ సభకు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు కథానాయకులై కదలి రావాలన్నారు.

హుజురాబాద్ నియోజకవర్గం నుండి సుమారు లక్షమంది తరలిరావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి హుజురాబాద్ కంచుకోట అని ఎల్కతుర్తి జనసముద్రంగా మారాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దాకా కాంగ్రెస్ పార్టీపై పోరాటానికి సిద్ధమన్నారు. 15 నెలల్లోనే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీదే అధికారమని ధీమ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ ఎర్రవెల్లి కొండారెడ్డితో పాటు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.