calender_icon.png 18 March, 2025 | 6:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హత కలిగిన నిరుపేద లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లు

17-03-2025 10:55:45 PM

కామారెడ్డి (విజయక్రాంతి): నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉంటే వెంటనే మార్కవుట్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ నుండి పలు శాఖల అధికారులతో కలిసి ఆర్డీఓ లు, సబ్ కలెక్టర్ లతో, ఎంపీడీఓ లు, ఎంపీఒ లు, ఎపిఒ లు, పంచాయతీ కార్యదర్శులతో ఇందిరమ్మ ఇండ్లు, ఎల్.ఆర్.ఎస్., పన్నుల వసూళ్లు, త్రాగునీరు, ఉపాధి హామీ పథకం, నర్సరీ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నిరుపేద లబ్ధిదారులు సిద్ధంగా ఉంటే మార్క్ అవుట్ వెంటనే ఇవ్వాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో మాడల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే ప్రారంభం చేయడం జరిగిందని, వాటి నిర్మాణాలు వెంటనే పూర్తిచేయాలన్నారు.

లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్దీకరణకు ఈ నెల 31 నాటికి 25 శాతం రెబెటు ఉన్నందున దరఖాస్తుదారులు నెలాఖరు లోగా చెల్లించుటకు దరఖాస్తుదారులు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని తెలిపారు. ఆర్డీఓ లు, సబ్ కలెక్టర్ లు పర్యవేక్షించాలని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసి పోతున్నందున ప్రాపర్టీ టాక్స్ వంద శాతం వసూలు చేయాలనీ తెలిపారు. జిల్లాలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అవసరం మేరకు అద్దె బోర్లు నుండి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని తెలిపారు. ప్రతీ రోజూ త్రాగునీటి సమస్యలపై వ్యతిరేక వార్తలు రావడం జరుగుతున్నదని, అట్టి వార్తలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు.

ఉపాధి హామీ పథకం క్రింద మంజూరు అయి ప్రారంభించని పనులను రద్దు చేసి, వాటు స్థానంలో సి.సి. రోడ్డు పనుల చేపట్టాలని ఆదేశించడం జరిగిందని, అట్టి సీసీ రోడ్డు పనులు ఈ నెలాఖరు లోగా పూర్తిచేయాలని అన్నారు. కూలీల సంఖ్య పెంచాలని, పనులు జరిగే ప్రాంతంలో నీడ, త్రాగునీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్ సిద్ధంగా ఉంచాలని తెలిపారు. నర్సరీల్లో పెంచే మొక్కల జర్మినేషన్ వంద శాతం పూర్తిచేయాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, జడ్పీ సీఈవో చందర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, హౌసింగ్ పి.డి. విజయాపాల్ రెడ్డి, పలు శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.