కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో నాలుగో తరగతి ఉద్యోగుల నియామకాల్లో అర్హులైన వారిని నియమించాలని డివైఎఫ్ఐ, కెవిపిఎస్ నాయకులు శుక్రవారం అసిస్టెంట్ డైరెక్టర్ గమనియల్ కు వినతి పత్రం అందజేశారు. జిల్లాలో విడుదలైన నోటిఫికేషన్ లో ఉద్యోగాల భర్తీ నిబంధనల ప్రకారం చేపట్టాలన్నారు. కొన్నిచోట్ల నిబంధనలకు విరుద్ధంగా పైరవీల పేరుతో ఉద్యోగాలు ఇచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. స్థానికులకు అవకాశం కల్పించాలని కోరారు. వినతిచ్చిన వారిలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గుడిసెల కార్తీక్ కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ ఉన్నారు.