ఎమ్మెల్యే శంకర్...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): సమాజంలో చిట్టా చివరి వరుసలో ఉన్న పేదవాళ్లకు మొదటి ప్రాధాన్యతగా వారికి సంక్షేమ పథకాలు అందాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar) అన్నారు. మంగళవారం రవీంద్రనగర్ లో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఎంపిక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రధానమంత్రి ఆవాస్ యోజన, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం సాయమైనా, రాష్ట్ర ప్రభుత్వం సహాయమైనా అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందాలన్నారు. ఎన్నికల సమయంలో పార్టీలు, రాజకీయాలు ఉంటాయని తర్వాత ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామల దేవి, మున్సిపల్ కమిషనర్ రాజు, నాయకులు లాలా మున్నా, జోగు రవి తదితరులు ఉన్నారు.