calender_icon.png 22 April, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎలిగేడు పాఠశాల అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలి

22-04-2025 12:00:00 AM

మండలంలో విస్తృత పర్యటనలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

ఎలిగేడు, ఏప్రిల్  21(విజయక్రాంతి): మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్  అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి ఎలిగేడు మండలంలో విస్తృతంగా పర్యటించారు.

ఎలిగేడు మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్యాక్స్ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం, లాలపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులు, ఎంపిపిఎస్ పాఠశాల, సుల్తాన్ పూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నర్సాపూర్ గ్రామంలో ఎంపిపిఎస్, ప్యాక్స్ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ను కలెక్టర్ పరిశీలించారు. ఎలిగేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు చేపట్టిన డైనింగ్ హాల్, కాంపౌండ్ వాల్ పనులను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు.

సుల్తాన్ పూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవీ విరమణ పొందుతున్న ఉపాధ్యాయురాలు వావిలాల సంధ్యా రెడ్డి ను కలెక్టర్ శాలువాతో సత్కరించారు.  పర్యటనలో  కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేందర్, డి.యం. శ్రీకాంత్ , ఎలిగేడు మండల తహసిల్దార్ బషీర్, ఎంపీడీవో భాస్కర రావు,  మండల పంచాయతీ అధికారి కిరణ్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.