calender_icon.png 18 January, 2025 | 3:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్టోబర్ 18 నుంచి పీకేఎల్ 11వ సీజన్

10-09-2024 03:13:00 AM

హైదరాబాద్ వేదికగా తొలి మ్యాచ్

న్యూఢిల్లీ: ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ అక్టోబర్ 18 నుంచి ప్రారంభం కానుంది. కాగా ఈ సీజన్ తొలి మ్యాచ్‌కు హైదరాబాద్ వేదిక కానుంది. అక్టోబర్ 18 నుంచి నవంబర్ 9 దాకా హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మ్యాచులు జరగనున్నాయి. ఆ తర్వాత నోయిడా, తర్వాత పూనే ప్రజలను కబడ్డీ క్రీడాకారులు అలరించనున్నాయి. ఈ సంవత్సరం త్రీ సిటీ ఫార్మా ట్‌లో మ్యాచ్‌లు జరగనున్నాయని నిర్వాహకులు ప్రకటించారు. తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.