హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 6 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా ఇళ్ల అమ్మకాల్లో టైర్- 2 నగరాలు హవా చూపించాయి. 30 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 11 శాతం మేర పెరిగి, 2.08 లక్షల యూనిట్లకు చేరుకున్నట్టు డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ వెల్లడించింది. ఆర్థిక పురోగతి, మౌలిక వసతుల అభివృద్ధి, ఇల్లు కొనుక్కోవాలనే ఆకాంక్ష పెరగడం వంటి అంశాలు ఇళ్ల డిమాండ్‌కు కారణాలని పేర్కొంది. దేశంలోని 30 ప్రధాన టైర్ -2 నగరాల్లో 2023 ఆర్థిక సంవత్సరంలో 2,07,896 ఇళ్లు అమ్ముడయ్యాయి.
అహ్మదాబాద్, వడోదర, సూరత్, నాసిక్, గాంధీనగర్, జైపూర్, నాగ్‌పూర్, భువనేశ్వర్, విశాఖపట్నం, మొహాలిల్లో 2023 -24లో 11 శాతం పెరుగుదలతో 1,68,998 ఇళ్లు అమ్ముడుకాగా, విశాఖలో 2022 5,525 ఇళ్లు అమ్ముడుకాగా, 2023 24లో 5,548 ఇళ్లు అమ్ముడయ్యాయి. ప్రాపర్టీ ధరలు తక్కువగా ఉండటం, వృద్ధి సంభావ్యత ఎక్కువగా ఉండటం వల్ల ఇళ్ల అమ్మకాల్లో టైర్ -1 నగరాల కంటే టైర్ -2 నగరాలు చక్కని పనితీరు కనబరిచినట్టు ప్రాప్ ఈక్విటీ ఫౌండర్, ఎండీ సమీర్ జసుజా పేర్కొన్నారు.