calender_icon.png 16 January, 2025 | 11:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్ నాలుక కోస్తే 11 లక్షలు

17-09-2024 04:26:18 AM

శివసేన ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

ముంబై, సెప్టెంబర్ 16: కాంగ్రెస్ అగ్రనే త రాహుల్‌గాంధీపై శివసేన (షిండే) ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ నాలుక కోసిన వారికి రూ.11 లక్షల ప్రైజ్‌మనీ ఇస్తానంటూ విదర్భ జిల్లా బుల్‌ఢాణా ఎమ్మెల్యే సంజయ్‌గైక్వాడ్ ప్రక టించారు. “యూఎస్ పర్యటనలో భాగంగా చేసిన ఓ ప్రస గంలో భారత్‌లో రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ రాహుల్ మాట్లాడా రు. ఇది ప్రజలకు చెప్పిన అతిపెద్ద అబద్ధం. ఓ వైపు మహారాష్ట్రలో రిజ ర్వేషన్ల డిమాండ్లు పెరుగుతున్నాయి. కానీ విదేశాలకు వెళ్లి భారత్‌లో రిజర్వేషన్లను తొలగిస్తామని ప్రకటిస్తున్నారు. రిజర్వేషన్లను దూరం చేస్తామన్న రాహుల్ మాటలతో కాంగ్రెస్ నిజస్వరూపం బయటప డింది. రాహుల్ నాలుకను ఎవరు నరికితే వారికి రూ.11 లక్షలు బహుమతిగా ఇస్తా” అని గైక్వాడ్ ప్రకటించారు. 

రాహుల్ ఏమన్నారంటే..

ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన రాహుల్‌గాంధీ.. భారత్‌లో మోదీ ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తేస్తామని ప్రకటించారు. దీనిని తప్పుగా అర్థం చేసుకుని గైక్వాడ్ వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. భారత సమాజంలో, రాజకీయాల్లో గైక్వాడ్ ఉండేందుకు అర్హులు కాదని మండిపడ్డారు. రాష్ట్రంలో రాజకీయాలను ఇలాంటి వ్యక్తులు నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ నేత భాయ్ జగతాప్ ఆరోపించారు. కాగా, గైక్వాడ్ వ్యాఖ్యలకు బీజేపీ నేతలు దూరంగా ఉన్నారు. కానీ, రాజ్యాంగ రచన సమయంలో జవహార్‌లాల్ నెహ్రూ రిజర్వేషన్లను వ్యతిరేకించారని గుర్తుచేస్తున్నారు.