calender_icon.png 27 December, 2024 | 7:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కురుమూర్తి స్వామి దర్శనానికి ఎలివేటేడ్ కారిడార్

08-11-2024 11:45:37 AM

ఎలివేటేడ్ కారిడార్ ఘాట్ రోడ్ నిర్మాణానికి 110 కోట్లు మంజూరు 

ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి 

నేడు కురుమూర్తి స్వామి ఉద్దాల మహోత్సవం 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): శ్రీ కురుమూర్తి దేవస్థానం గుట్ట పైకి వెళ్లేందుకుగాను ఎలివేటేడ్ కారిడార్ ఘాట్ రోడ్డును నిర్మించేందుకు అవసరమైన నిధులు మంజూరు అయ్యాయని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలియజేశారు. భక్తులకు ఈ కారిడార్ ఘాట్ రోడ్ ఏర్పాటు చేయడం ద్వారా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, పర్యటక ప్రాంతంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఏర్పడుతుందని పేర్కొన్నారు. చిన్నచింతకుంట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థాన గుట్టపైకి వెళ్లేందుకు ఎలివేటేడ్ కారిడార్ తో కూడిన ఘాట్ రోడ్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 110 కోట్ల శాంక్షన్ చేయించిన దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ.జి మధుసూదన్ రెడ్డి సందర్భంగా జీవోను R&B చీఫ్ సెక్రటరీ సంబంధించిన జీవోను ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అందజేశారు, కురుమూర్తి దేవస్థానం వద్ద ఎలివేటేడ్ కారిడార్ తో కూడిన ఘాట్ రోడ్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, R&B శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణంతో కొత్త రూపు సంతరించుకొని పర్యాటక కేంద్రంగా మారనున్న కురుమూర్తి దేవస్థానం వేగంగా అభివృద్ధి చెందుతోంది. నేడు ఉద్దాల మహోత్సవం దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలంలోని శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టం ఉద్దాల మహోత్సవం సందర్భంగా ఉదయం చిన్న చింతకుంట మండలం పల్లమర్రి గ్రామం నుంచి బయలుదేరి, మధ్యాహ్నం 12:00 గంటలకు వడ్డేమాన్ గ్రామంలో ప్రత్యేక పూజలు అందుకున్న తర్వాత ఉద్దాలు కురుమూర్తి స్వామి దేవస్థానంకు ఊరేగింపుగా బయలుదేరుతాయి.