calender_icon.png 10 January, 2025 | 11:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏలేటి చిలుక జోతిష్యుడిగా సూటవుతారు: అడ్లూరి

02-11-2024 12:48:13 AM

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి  ఎమ్మెల్యేగా కంటే.. చిలుక జోతిష్యుడిగా బాగా నప్పుతారని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిని మారుస్తారని, రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే.. ఆయనపై జాలేస్తుందని అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మండిపడ్డారు.

మీడియాలో పాపులారిటీ కోసమే మహేశ్వర్‌రెడ్డి అవగాహనలేని మాటలు మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్ నాయకత్వంలో ఎమ్మెల్యేలంతా ప్రజా సమస్యల కోసం పని చేస్తున్నారని స్పష్టం చేశారు.