ఢిల్లీలో రేవంత్‌రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే
కామారెడ్డి, జూలై 4 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ కాంగ్రెస్ ఇన్చార్జి ఏనుగు రవీందర్‌రెడ్డి బీజేపీలో చేరుతారన్న ప్రచారం నేపథ్యంలో గురువారం ఆయన ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంచరించుకున్నది. ఏనుగు రవీందర్‌రెడ్డికి బాన్సువాడ కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంతో తక్కువ సమయంలోనే పార్టీని పటిష్టం చేశారు. నాయకులకు, కార్యకర్తలకు ఆయన పెద్ద దిక్కుగా మారారు. ఇటీవల బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో రవీందర్‌రెడ్డి రాజకీయ భవిషత్ ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారుతారనే ఊహాగానాలు రావడంతో శ్రేణులు అయోమయానికి గురయ్యాయి. కాగా, ఢిల్లీలో సీఎంను రవీందర్‌రెడ్డి కలవడం హాట్ టాపిక్‌గా మారింది. రవీందర్‌రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారా? కార్పొరేషన్ పదవీ అప్పగిస్తారా అన్న చర్చ జరుగుతుంది.